కలుషిత మంచినీళ్లు తాగి 93 మందికి అస్వస్థత..!

నవతెలంగాణ-హైదరాబాద్ : కలుషితమైన మంచినీళ్లు తాగి 93 మంది అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలోగల ముగావ్ టాండా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ బావి నుంచే ఆ గ్రామానికి నీళ్లు సరఫరా అవుతాయి. ఆ నీళ్లు కలుషితం కావడంతో అందరూ అస్వస్థతకు గురయ్యారు. ముగావ్‌ టాండా గ్రామంలో మొత్తం 107 ఇండ్లు ఉన్నాయి. 440 మంది జనాభా ఉన్నారు. జూన్‌ 26, 27 తేదీల్లో 93 మంది అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో మెడికల్‌ క్యాంప్‌ వేసి చికిత్స అందించారు. 56 మంది గ్రామంలోనే రికవరీ అయ్యారు. మరో 37 మందిని పొరుగున ఉన్న మంజారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వాళ్లు కూడా కోలుకున్నారు. బావిలోని కలుషిత నీళ్లే ప్రస్తుత పరిస్థితికి కారణమని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఆ బావిని సీజ్ చేశారు. పొరుగూరిలోని ఫిల్టర్‌ నుంచి ముగావ్‌ టాండా గ్రామానికి తాగు నీళ్లను సరఫరా చేస్తున్నారు.

Spread the love