నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగేండ్ల ఒప్పందాన్ని పూర్తిచేసుకున్న జేపీఎస్‌ల పనితీరును జిల్లా స్థాయిలో వేసిన పనితీరు మూల్యాంకన కమిటీ పరిశీలించాలని సూచించారు. దానికి సంబంధించిన రిపోర్ట్‌లను ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. నాలుగేండ్ల పనితీరులో 70 శాతం మార్కులను సాధించిన జేపీఎస్‌లను పంచాయతీరాజ్ శాఖ రూల్స్ ప్రకారం గ్రేడ్-4 కింద పర్మినెంట్ చేయాలని సూచించారు. 70 శాతం మార్కులు సాధించని జేపీఎస్‌లు తమ పనితీరును మెరుగు పరుచుకునేందుకు మరో ఆరు నెలల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. అప్పుడు వారి పనితీరును బట్టి పర్మినెంట్ చేయాలని సూచించారు.