నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలోనే సూర్యుడు చిటపటలాడుతూ 40 డిగ్రీల టెంపరేచర్ క్రాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు పని చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లు, పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరుక పని చేస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని డీఈవోలను ఆదేశించారు.
విద్యార్థులకు గుడ్ న్యూస్..ఒంటిపూడ బడులు ఎప్పటి నుంచి అంటే..?
- Advertisement -
- Advertisement -



