Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యుద్ధం సాకుతో గ్యాస్ బ్లాక్‌ మార్కెట్‌ 

యుద్ధం సాకుతో గ్యాస్ బ్లాక్‌ మార్కెట్‌ 

- Advertisement -

– సరసమైన ధరలకు వంటగ్యాస్‌, ఇతర సరుకులు అందించాలి
– ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్
నవతెలంగాణ-కంఠేశ్వర్  : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దురాక్రమణ దాడి తర్వాత లాభాపేక్షతో బడా వ్యాపారస్తులు సాగిస్తున్న బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టి సరసమైన ధరలకు వంటగ్యాస్‌, ఇతర సరుకులు అందించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. వంటగ్యాస్‌ ధర పెరగడంతోపాటు బ్లాక్‌ మార్కెటింగ్‌ వల్ల సిలిండర్లు దొరకని కారణంగా దేశమంతటా నగరాలు, పట్టణాలు హోటళ్లు మూతపడడంతో పాటు, కొన్ని రకాల వంటకాలు లభించడం లేదని ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాధారణమైన తోపుడుబండ్లు, చిన్న కాకా హోటళ్ల నిర్వాహకుల బతుకులు బజారునపడతాయని వివరించారు. అసంఘటిత కార్మికులు, చిరుద్యోగులకు లభించే టీ, టిఫిన్‌, భోజనం సరసమైన ధరకు దొరక్కుండా పోయే ప్రమాదం ఏర్పడుతుందని, ఈలోగా వాటి ధరలు అమాంతం పెరిగిపోతాయని, వంటగ్యాస్‌ కొరత వల్ల ఆహార లభ్యత మొదలు ఉపాధి వరకు వివిధ రూపాల్లో సమాజంపై దుష్ప్రభావం పడుతుందని తెలిపారు. ఇప్పటికే గహ వినియోగదారులు సిలిండర్‌ కోసం బుక్‌ చేస్తుంటే తగిన స్పందన ఉండటం లేదని, ఇంతకుముందే బుక్‌ చేసిన వారికీ ఐదారు రోజులైనా గ్యాస్‌ సిలిండర్‌ రావడం లేదని పేర్కొన్నారు. ఇళ్లలో, మార్కెట్లలో ఇటువంటి సమస్యలు ఏర్పడుతుండగా వ్యవసాయ రంగానికి కూడా ఎరువుల లభ్యత సమస్యగా మారనుందని పేర్కొన్నారు. గ్యాస్‌ కొరత రాకుండా బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలని, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనంతరం పెట్రోలు, డీజిల్‌ ధరలూ పెరుగుతాయని వార్తలు వస్తున్నాయని, దాంతో సరుకు రవాణా, ప్రజా రవాణా కూడా భారమవుతాయని తెలిపారు. గల్ఫ్‌కు ఎగుమతులు ఆగిపోయిన దృష్ట్యా గుడ్లు, పండ్లు, బియ్యం, ఆక్వా, గ్రానైట్‌ సరుకులు నిల్వలు ఉండిపోతున్నాయని, వ్యాపారస్తులు రైతుల నుండి వీటిని ధరలు తగ్గించి కొంటున్నారని పేర్కొన్నారు. ఇరాన్‌ పక్కనే ఉన్న స్ట్రెయిట్‌ ఆఫ్‌ హర్ముజ్‌ మూత లేదా ఆంక్షల వల్ల ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడిందని వివరించారు. దీన్ని సాకుగా చూపి బడా వ్యాపారస్తులు, మిల్లర్లు ధాన్యం, అరటి సహా పండ్లు తదితర వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గించేస్త్తున్నారని తెలిపారు. ఎగుమతులు సజావుగా సాగడానికి యుద్ధం ఆటంకమవుతుందని, రైతులకు, వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన మోడీ ప్రభుత్వం బడా వ్యాపారస్తుల కొమ్ముకాస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని సాకుగా చూపుతోందని తెలిపారు. ఇరాన్‌పై యుద్ధానికి తెగబడింది, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు మూల కారణం ముమ్మాటికి అమెరికా ఇజ్రాయిల్‌ దేశాలేనని పేర్కొన్నారు. టు ట్రంప్‌, ఇటు నెతన్యాహు తనకు అనుంగు మిత్రులని చెప్పే ప్రధాని నరేంద్ర మోడీ వినాశకరమైన యుద్ధం నిలుపుదల చేయడానికి వెంటనే కషి చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -