Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 95.91 శాతం హాజరు

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 95.91 శాతం హాజరు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు గురువారం మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని నోడల్ ఆఫీసర్ షేక్ సలాం తెలిపారు. గురువారం జరిగిన పరీక్షలకు కామారెడ్డి జిల్లాలో మొత్తం 9,638 మంది విద్యార్థులకు పరీక్షలు కేటాయించగా, అందులో 9,244 మంది హాజరయ్యారు. 394 మంది గైర్హాజరయ్యారు. దీంతో మొత్తం 95.91 శాతం హాజరు నమోదైందన్నారు.

 కొన్ని కేంద్రాల్లో అత్యధిక హాజరు నమోదు కాగా, డోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 100 శాతం హాజరు నమోదైంది.  సదాశివనగర్, మద్నూర్, బిబిపేట్ కేంద్రాల్లో  అధిక శాతం హాజరు నమోదైందన్నారు.

జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -