విషాదం..గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్న గుండెపోటుకు మరో బాలిక బలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంకు చెందిన నిహారిక (13) గుండె పోటుతో చనిపోయింది. తనకు కడుపు నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు నిహారిక చెప్పగా మణుగూరులో ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా కుప్పకూలింది. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో నిహారిక చనిపోయిందని నిర్ధారించారు.

Spread the love