28 ఏళ్ల మహిళతో 60 ఏళ్ల వృద్ధుడి ప్రేమ

నవతెలంగాణ – హైదరాబాద్
ఆరు పదుల వయసున్న ఓ వృద్ధుడు ఇద్దరు పిల్లలున్న ఓ మహిళను ప్రేమించాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా వినకుండా పోలీస్‌ స్టేషన్‌లోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వింత ఘటన జరిగింది. భదోహి జిల్లాలోని బీహరోజ్‌పుర్‌కు చెందిన రామ్‌ యాదవ్‌(60), 28 ఏళ్ల అషర్ఫీ దేవిని ప్రేమించాడు. ఆమెకు అంతకు ముందే కృష్ణ మూరత్‌ యాదవ్‌తో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కృష్ణ మూరత్‌ తమిళనాడులో పని చేస్తున్నాడు. ఇటీవల అషర్ఫీ దేవి.. రామ్‌ యాదవ్‌తో పారిపోయింది. కృష్ణ మూరత్‌ ఫిర్యాదుతో పోలీసులు రామ్‌ యాదవ్‌, అషర్ఫీ దేవిల ఆచూకీ కనుగొని వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తన భర్తతో వెళ్లనని, రామ్‌ యాదవ్‌నే వివాహం చేసుకుంటానని అషర్ఫీ దేవి పోలీసుల ఎదుట చెప్పింది. రామ్‌ యాదవ్‌ కూడా తన కుటుంబ సభ్యుల మాట వినలేదు. దీంతో చేసేదేమి లేక ఇరువురి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ఉన్న గుడిలో బుధవారం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Spread the love