నవతెలంగాణ-హైదరాబాద్ : కిరణ్ నేగి అనే మహిళ నోయిడా యూపీలోని ఆసుపత్రిలో గర్భాశయంలో కణితి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నారు. తర్వాత ఆమెకు కడుపునొప్పి మొదలైంది. వైద్యులను సంప్రదించినా సరిగా స్పందించలేదు. గతేడాది మరో ఆసుపత్రికి వెళ్లగా కడుపులో 9 అంగుళాల ప్లాస్టిక్ పైపు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు దాన్ని తొలగించారు. తొలుత చేసిన సర్జరీ వైద్యులు తన కడుపులో ప్లాస్టిక్ బ్యాగ్ పైపు వదిలేశారని కిరణ్ వాపోయారు. వారిపై కేసు వేశారు.