యజమాని కొట్టడంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న బార్ వర్కర్

– 83% కాలిపోయి ప్రాణాపాయ స్థితిలో బ్రాండ్ షాప్ వర్కర్ సత్తీష్
నవతెలంగాణ -తాడ్వాయి
మేడారం ఆర్చి గేటు వద్ద బ్రాండ్ షాప్ యజమాని కొట్టాడని, వర్కర్ పెట్రోల్ మీద పోసుకొని నిప్పుట్టించుకుని ఆత్మహత్యయత్నం చేసున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం వరంగల్ పట్టణంలోని కరీమాబాద్ ఆర్ముక బార్ యజమాని వర్కర్లతో మేడారం వనదేవతల దర్శనానికి వచ్చారు. బార్ సిబ్బంది మేడారం యాత్ర లో  బార్ యజమాని(కొట్టాడని) మందలించాడని మనస్థాపంతో బార్ వర్కర్ మేడిపల్లి సతీష్ మనస్థాపానికి గురై పెట్రోల్ మీద పోసుకొని మేడారంలో ఆత్మయత్నానికి పాల్పడ్డాడు. సతీష్ అగ్నికి ఆహుతై, తీవ్ర గాయాల పాలై పరిస్థితి విషమించడంతో స్థానిక వైద్యులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love