అందరికీ సంతృప్తినిచ్చే సుందరం మాస్టర్‌

అందరికీ సంతృప్తినిచ్చే సుందరం మాస్టర్‌ఆర్‌ టీ టీం వర్క్స్‌, గోల్‌ డెన్‌ మీడియా పతాకాలపై రవితేజ, సుధీర్‌ కుమార్‌ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్‌’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 23న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హీరో సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో ఆయన బిగ్‌ టికెట్‌ను లాంచ్‌ చేశారు. ‘చిరంజీవి ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేం. నాగ చైతన్య పాటను, సాయి ధరమ్‌ తేజ్‌ టీజర్‌ను లాంచ్‌ చేశారు. పదేళ్ల క్రితం ఆడియెన్స్‌ మధ్యలో ఉన్నాను. ఇప్పుడు ఈ స్టేజ్‌ మీద ఉన్నాను. మనం గట్టిగా నమ్మితే ఏదైనా సాధించగలం’ అని హర్ష చెముడు చెప్పారు.
సుధీర్‌ కుమార్‌ మాట్లాడుతూ,’మా కథను నమ్మి రవితేజ ముందుకు వచ్చారు. అప్పుడు మా మీద మాకు నమ్మకం ఏర్పడింది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ‘మా సినిమా పోస్టర్లు, టీజర్‌,ట్రైలర్‌లు అందరికీ నచ్చాయి. ఈ సినిమాలోని ఇన్నోసెన్స్‌ వల్లే అందరికీ నచ్చింది. రవితేజ మాకు అందించిన సపోర్ట్‌ను ఎప్పటికీ మరిచిపోలేం. ప్రకతి అందరికీ ఒకేలా కనిపించదు. రైతుకు వర్షం అన్నం పెడితే.. రోడ్డు పక్కన బిజినెస్‌ చేసేవాళ్లకు ఫుడ్‌ లాక్కుంటుంది. అలా ఈ సినిమాను ఎన్నో కోణాల్లో చూపించాం. ఎంత పెద్ద హిట్‌ అవుతుందో తెలియదు కానీ.. మా అందరికీ గౌరవాన్ని తీసుకొస్తుంది. సినిమాను చూసిన వారందరికీ ఓ సంతప్తిని మాత్రం ఇస్తుంది’ అని డైరెక్టర్‌ కళ్యాణ్‌ సంతోష్‌ చెప్పారు.

Spread the love