బస్సును ఢీకొన్న బైక్..ఒకరికి తీవ్రగాయాలు

నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ బైపాస్ రోడ్డులో మంగళవారం బస్సును ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయినట్లు బోర్గాం 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. వారు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రెడ్డిపేట్కు చెందిన సుధాకర్ ద్విచక్ర వాహనం పై నిజామాబాద్ లో తన బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి రెడ్డి పేట్ వెళ్తుండగా డివైడం వద్ద ప్రయాణీకుడిని దించడానికి బస్సు డ్రైవర్ ఆకస్మత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక ఉన్న ద్విచక్ర వాహనం ఢీ కొన్నది. ఈ ఘటనలో సుధాకర్  తీవ్రంగా గాయపడగా, 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రి తరలించారు.
Spread the love