ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన బొలెరో

– ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు 
నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం ఫర్టిలైజర్ కంపెనీ లో విధులు నిర్వహిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన రాం కుమార్ అనే వ్యక్తి కారులో సుమారు ఉదయం 8 ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి ఏటూరు నాగారం వస్తున్నాడు. ఈ క్రమంలో తాడ్వాయి సమీపంలోని 163వ జాతీయ రహదారిపై బొలెరో వాహనం కారు కు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో అందులో ఉన్న రాంకుమార్(40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. క్షతగాత్రులను ములుగు దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని ఏటూర్ నాగారం సిహెచ్సి మార్చ్లలో భద్రపరిచారు.కాగా సమాచారం తెలుసుకున్న తాడ్వాయి స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్ హుటాహుటిన తన బలగాలతో సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రక్షించి,
 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Spread the love