అంగన్‌వాడీలో తాడు మెడకు చుట్టుకుని బాలుడు మృతి

నవతెలంగాణ – అమరావతి: ఏపీలోని కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో విషాదం చోటుకుంది. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో తాడు మెడకు చుట్టుకుని చంద్రశేఖర్‌ అనే బాలుడు మృతి చెందాడు. తూకం వేసే ఉయ్యాల తాడు మెడకు చుట్టుకుని ఊపిరి ఆడక అక్కడికక్కడే చనిపోయాడు. అంగన్‌వాడీ టీచర్‌ సెలవుల్లో ఉండడంతో ఆమె సహాయకురాలు విధులను నిర్వహిస్తుంది. ఆమె మిగతా చిన్నారులను తీసుకువచ్చేందుకు ఇళ్లకు వెళ్లగా బాలుడు తలుపులు తీసుకుని వెళ్లి తూకం ఉయ్యాల ఎక్కాడు. దీంతో తాడు మెడకు చుట్టుకుని మృతి చెందాడు. తమ కుమారుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికుల కంట కన్నీరు తెప్పించింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Spread the love