నవతెలంగాణ-గోవిందరావుపేట : మండలంలోని గాంధీనగర్ గ్రామంలో గురువారం సమీపంలోని ఎర్రకుంటలో ఈతకు వెళ్లి మాలోతు రాహుల్ (11) అనే బాలుడు ప్రమాదవశాత్తు కుంటలో మునిగి చనిపోయాడు. గాంధీనగర్ గ్రామానికి చెందిన మాలోతు కవిత చందు దంపతులకు ఒక కొడుకు,కుమార్తె పెద్దవాడైన రాహుల్ మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకుంది, బాలుని మృతితో గాంధీనగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి బాలుని కుటుంబ సభ్యులు బంధువుల కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయారు.