నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని చంద్రాపుర్‌లో క్రికెట్ ఆడుతుండగా ఏర్పడిన వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. 13 ఏళ్ల అబ్బాయి 12 ఏళ్ల బాలుడి తలపై బ్యాటుతో కొట్టాడు. దీంతో ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 3న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బాలుడి తలపై బ్యాటుతో బలంగా బాదడంతో అతను కుప్పకూలిపోయాడు. దీంతో మైదానంలో ఉన్నవారు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 5న ప్రాణాలు కోల్పోయాడు. 6న బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.