మేనమామను కత్తితో పొడిచి చంపిన బాలుడు

The boy who stabbed his uncle to deathనవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని మేడ్చల్ మండలం కిష్టాపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16 ఏండ్ల బాలుడు తన సొంత మేనమామను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. వెంకటరమణ గొంతు కోసి హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. నిందితుడు హత్యకు గురైన వ్యక్తి అక్క కొడుకే కావడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Spread the love