గర్ల్ ఫ్రెండ్ కోసం తల్లి బంగారాన్ని దొంగిలించిన బాలుడు

నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన జరిగింది. స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఐఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఒక బాలుడు ఏకంగా తన అమ్మ నగలు దొంగిలించాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తన స్నేహితురాలి పుట్టిన రోజున గిఫ్ట్‌ ఇవ్వాలని భావించాడు. దీని కోసం తల్లిని డబ్బు అడగ్గా ఆమె ఒప్పుకోలేదు. అయితే, సైలెంట్‌గా ఇంట్లో రెండు బంగారు గొలుసులు, బంగారు చెవిపోగులు, బంగారు ఉంగరం దొంగిలించి, రూ.50,000 ఖరీదైన ఐఫోన్‌ కొని స్నేహితురాలికి గిఫ్ట్‌ ఇచ్చాడు.
Spread the love