సరికొత్త కాన్సెప్ట్‌

A brand new conceptచంటి, లహరి హీరో, హీరోయిన్లుగా అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై రూపొందుతున్న చిత్రం ‘హ్యాష్‌ ట్యాగ్‌ ఎపి31’. ‘నెంబర్‌ మిస్సింగ్‌’ ట్యాగ్‌ లైన్‌. కె.వి.ఆర్‌ దర్శకత్వంలో నారాయణ స్వామి.ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సలీమ్‌ మాలిక్‌ (మ్యాక్‌) అడిషనల్‌ స్క్రీన్‌ ప్లే అందించారు. ఆదివారం జరిగిన ప్రెస్‌ మీట్‌లో దర్శకుడు త్రినాథ రావు నక్కిన మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ని నిర్మాత బెక్కెం వేణు గోపాల్‌ విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో చంటి మాట్లాడుతూ, ‘నిర్మాత నారాయణ స్వామి బాగా ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నారు. డైరెక్టర్‌ కె.వి.ఆర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రజ్వల్‌, స్క్రీన్‌ ప్లే రైటర్‌ మ్యాక్‌ ఇలా అందరూ బాగా కష్టపడుతున్నాం. భాష్యశ్రీ ప్రతి డైలాగ్‌, పాటను చక్కగా రాశారు. లహరి చాలా గొప్ప పెర్ఫామర్‌. తను అబ్బాయిలతో సమానంగా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించింది’ అని తెలిపారు. ‘నిర్మాత నారాయణ స్వామి నాతో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే సినిమాను చేస్తున్నారు. అది కూడా భారీగా చేస్తున్నారు. మంచి నటీనటులు, టెక్నీషియన్స్‌ను ఇచ్చి నిర్మిస్తున్నారు. హీరో చంటిని స్క్రీన్‌ పైన చూస్తుంటే ఫస్ట్‌ టైమ్‌ హీరోలా అనిపించరు. అంత చక్కగా నటించారు. లహరి చాలా డేడికేషన్‌తో వర్క్‌ చేశారు. అద్భుతంగా నటించారు. అందరి సపోర్ట్‌తో సినిమాను కూల్‌గా పూర్తి చేస్తున్నాం’ అని దర్శకుడు కె.వి.ఆర్‌ అన్నారు.
నాయిక లహరి మాట్లాడుత, ‘నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్‌ కె.వి.ఆర్‌కి, నిర్మాత నారాయణ స్వామికి థ్యాంక్స్‌’ అని తెలిపారు. వినోద్‌ కుమార్‌, తులసి, జయసుధ, షియాజీ షిండే, బాబు మోహన్‌, పథ్వీరాజ్‌, పాకీజా, స్వర్ణలత తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Spread the love