నవతెలంగాణ – హైదరాబాద్
బిహార్ రాష్ట్రం బాగల్‌పుర్‌లోని కహల్‌గావ్ ప్రాంతంలో కాసేపట్లో మూడుముళ్లు పడతాయనగా.. ఈ పెండ్లి చేసుకోనంటూ వధువు కిట్టూ కుమారి మొండికేసింది. వరుడు నల్లగా ఉన్నాడని, వయసులో తనకంటే చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడని చెప్పి నిరాకరించింది. ఊరేగింపుగా వచ్చిన వరుడు వివాహ వేదికపైకి వచ్చాక.. అతణ్ని చూడగానే యువతి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. వరుడి మెడలో దండ వేసి, తిలకం పెట్టేందుకు ససేమిరా అంది. వరుడి కుటుంబసభ్యులు ఆమెను పెండ్లికి ఒప్పించేందుకు పలు హామీలు ఇచ్చారు. వెనక్కి తగ్గని వధువు.. మరింత మొండిగా ప్రవర్తించింది. చివరకు వివాహాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.