మేడ్చల్‌ జిల్లాలో యువతి దారుణ హత్య..

నవతెలంగాణ – హైదరాబాద్: మేడ్చల్‌ జిల్లాలో దారుణం జరిగింది. 25 ఏళ్ల యువతిని బండరాళ్లతో కొట్టి కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. యువతిని హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు నిందితులు. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్‎లో ఈ ఘటన జరిగింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Spread the love