బెనారస్ హిందూ యూనివర్సిటీలో యువతిని లైంగికంగా వేధించిన బస్ డ్రైవర్

నవతెలంగాణ – హైదరాబాద్: వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటిలో పదేపదే అమ్మాయిలపై వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈసారి యూనివర్సిటీకి చెందిన ఓ బస్ డ్రైవర్ విద్యార్థిని లైంగికంగా వేధించాడు. ఆదివారం ఈ ఘటన జరగ్గా బాధితురాలు చీఫ్ ప్రోక్టర్ (ఇన్‌చార్జ్)కు ఫిర్యాదు చేసింది. దర్యాప్తుకు ఆదేశించిన ఆయన బస్ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారు. అమ్మాయిలపై క్యాంపస్‌లో లైంగిక వేధింపులు జరగడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెలలో ఐఐటీ-బీహెచ్‌యూకు చెందిన అమ్మాయిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజా కేసు విషయానికి వస్తే బాధితురాలు బీకాం విద్యార్థిని. క్యాంపస్ బయట ఉంటూ చదువుకుంటోంది. ఈ నెల 19న డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు.

Spread the love