Watch | Bus Tries To Cross River In Uttarakhand, Starts Tilting, Passengers Jump Out pic.twitter.com/anspZg5PiX
— NDTV (@ndtv) July 9, 2023
నవతెలంగాణ – డెహ్రాడూన్: ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో నది దాటడానికి ప్రయత్నించి ఓ బస్సు వరదలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు బస్సు కీటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.