కాలిఫోర్నియాలో కుప్పకూలిన బిజినెస్‌ జెట్‌…

jet-plain-crashనవతెలంగాణ – అమెరికా
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ జెట్‌ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆరుగురు దుర్మణంపాలయ్యారు. శనివారం తెల్లవారుజామున ఫ్రెచ్‌వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఆరుగురు చనిపోయారని రివర్‌సైడ్‌ కౌంటీ షెరీఫ్‌ అధికారులు తెలిపారు. ఆ విమానం లాస్‌ వెగాస్‌లోని హ్యారీ రీడ్‌ అంటర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిందన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు, ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టిందన్నారు. ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.

Spread the love