ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింన కారు

– ద్విచక్ర వాహనదారుడు ప్రజన్ మృతి
నవతెలంగాణ- శామీర్ పేట: ద్విచక్ర వాహనాన్ని వెనకనుండి కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ లోని ఆర్ టి సి కాలనీకి చెందిన తోటపల్లి ప్రజన్ (24 )   చదువుకుంటూ పొలిమర్ స్టీల్ ప్రైవేటు లిమిటెడ్  నందు పార్ట్ టైమ్ జాబ్ చేస్తు చదువుకుంటున్నారు.. అయితే ఈ నెల 11న  ఉదయం సమయం  8 గంటల ప్రాంతంలో ఎం బి ఏ పరీక్ష రాయడానికి  ప్రజన్ తన  స్నేహితుడు సింహాచలం తో కలిసి  హోండా ఆక్టివా(  టి ఎస్15 ఈ ఎక్స్2510) పై మేడ్చల్ నుండి ఘట్ కేసర్ కి వెళ్తుండగా మార్గ మద్యలో శామీర్ పేట  సెలెబ్రిటీ క్లబ్ కి దగ్గరలో ఒక గుర్తు తెలియని తెలుపు రంగు కారు ని నడిపే డ్రైవరు  అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ప్రజన్ నడుపుతున్న ఆక్టివాను క వెనక నుండి ఢీ కొట్టి కారు ఆపకుండా అక్కడనుండి వెళ్లిపోయినాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రజన్ తలకి బలమైన రక్త గాయం కావడంతో చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్  లో కొంపల్లి లోని శ్రీకార హాస్పిటల్ కి తరలించగా ప్రజన్ చనిపోయినట్లుగా డాక్టర్ ధ్రువీకరించారని ఈ మేరకు   పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Spread the love