మెకానిక్ షాపులోకి దూసుకెళ్లిన కారు

నవతెలంగాణ-వరంగల్: కారు అదుపు తప్పి రోడ్డుపక్కనున్న ఓ మెకానిక్ షాపులోకి దూసుకెళ్లిన ఘటన వర్ధన్నపేట పట్టణంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖమ్మం- వరంగల్ వైపు వెళ్తున్న కారు వర్ధన్నపేటలోని జాతీయ రహదారిపై అతివేగంతో రోడ్డు పక్కనున్న మెకానిక్ షాపులోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Spread the love