నటుడు ఫహద్ ఫజిల్ పై కేసు నమోదు..

నవతెలంగాణ – హైదరాబాద్: ‘పుష్ప’ విలన్ ఫహాద్ ఫాజిల్‌పై కేరళలో కేసు నమోదయింది. ఆయన నటిస్తూ నిర్మిస్తున్న ‘పెయిన్కిలీ’ సినిమా షూటింగ్‌ను ఎర్నాకులం ప్రభుత్వాస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చిత్రీకరించారు. అందులోకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మానవ హక్కుల కమిషన్.. నిర్మాత ఫహాద్ ఫాజిల్‌పై కేసు నమోదు చేసింది.

Spread the love