నటుడు మన్సూర్‌ అలీఖాన్‌పై కేసు నమోదు

నవతెలంగాణ- హైదరాబాద్: కోలీవుడ్ బ్యూటీ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పలు భాషల ఇండస్ట్రీల ప్రముఖులు మన్సూర్​పై మండిపడుతూ.. త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్​ స్పందించింది. మన్సూర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై తాజాగా మాట్లాడిన మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని అన్నారు. తాను తప్పుగా ఏం మాట్లాడలేదని సమర్థించుకున్నారు. తనేంటో తమిళ ప్రజలకు తెలుసని.. వారి మద్దతు తనకు ఉందని అన్నారు. ‘సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా? సినిమాల్లో రేప్‌ చేస్తే నిజంగానే చేసినట్లా?’ అంటూ తన మన్సూర్ అలీఖాన్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

Spread the love