నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ కమెడియన్, ప్రముఖ నటుడు బిత్తిరి సత్తికి ఊహించని శాక్ తగిలింది. బిత్తిరి సత్తి పైన తాజాగా కేసు నమోదు అయింది. టాలీవుడ్ నటుడు బిత్తిరి సత్తి పైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కొంతమంది పోలీసు కేసు నమోదు చేశారు. భగవద్గీత ను కించపరిచేలా వీడియోని చేశారని… ఆరోపణలు చేస్తూ బిత్తిరి సత్తి పైన వానర సేన అనే సభ్యులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బిత్తిరి సత్తి పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.