నవతెలంగాణ హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ తన ఫోన్ ట్యాపింగ్ చేశారని.. అక్రమ కేసులు పెట్టి వేధించారని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్‌రావుపై 120(బి), 386, 409, 506, రెడ్‌విత్ 34, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. హరీశ్‌రావుతోపాటు అప్పటి టాస్క్‌ఫోర్స్ డీజీ రాధాకిషన్‌రావుపైనా కూడా కేసు నమోదైంది.