నవతెలంగాణ – అశ్వారావుపేట
నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రమాదానికి కారణమైన ఓ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్.హెచ్.ఒ ఎస్ఐ శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం కరీంనగర్ నుంచి కాకినాడ కు అశ్వారావుపేట మీదుగా గ్రానైట్ రాళ్ల లోడుతో వెళ్లే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆశ్వారావుపేట శివారులో ఎదురుగా వచ్చే మరో లారీ ను తప్పించే క్రమంలో చెట్టును ఢీ కొట్టింది. దాంతో ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసం కాగా, డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమాచారం అందుకున్న బ్లూ కోట్ కానిస్టేబుళ్లు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకొని నిర్లక్ష్యంగా లారీ నడిపిన మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు చెందిన లారీ డ్రైవర్ చీపిరి సమ్మయ్య పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బ్లూ కోట్ సిబ్బంది ఫిర్యాదుతో లారీ ను వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి నందుకు లారీ డ్రైవర్ సమ్మయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.