తిడుతూ బెదిరించిన అటవీ అధికారిపై కేసు నమోదు

నవతెలంగాణ – గోవిందరావుపేట
ఇద్దరు వ్యక్తులను దూషిస్తూ బెదిరించిన విషయంలో అటవీ అధికారిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు పసర ఎస్ ఐ ఎస్ కె మస్తాన్ తెలిపారు. ఎస్ ఐ షేక్ మస్తాన్ కథనం ప్రకారం పసర పోలీస్ స్టేషన్ నందు ఫారెస్టు అధికారి పై ఒక కేసు నమోదు కావటం జరిగిందనీ. కేసు వివరాలు  చల్వాయి గ్రామం లో వక్ఫ్ బోర్డ్ కు చెందిన 4 ఎకరాల భూమిలొ ఫారెస్ట్ అధికారి అయిన తేజవత్ దిప్ లాల్ అక్రమంగా నర్సరీ మొక్కలు దింపుతుండగా అదే గ్రామనికి చెందిన Md జహరుద్దీన్ మరియు Md షఫీలమ్ అడ్డుకోగా దీప్ లాల్ ఇష్టం వచ్చినట్లు తిట్టి ఎస్టి అట్రాసిటీ కేసులు పెడతానని బెదిరించడం తో బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడం జరిగిందన్నారు. భాదితుని ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనైనదనీ తెలిపారు.
Spread the love