– అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తే చర్యలు
నవతెలంగాణ-వీణవంక
మండలంలో అక్రమంగా మద్యాన్ని అధిక ధరలకు విక్రియస్తే కఠిన చర్యలు తప్పవని వీణవంక ఎస్సై బీ వంశీకృష్ణ హెచ్చరించారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పంజాల కుమారస్వామి అనే వ్యక్తి గ్రామంలో అక్రమంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా రూ.ఆరు వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకుని పంజాల కుమారస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ మండలంలో ఎవరైన బెల్ట్ షాపులను నడిపితే సమాచారం ఇవ్వాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామాని తెలిపారు. అలాగే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.