గులాబీ కండువాతో ఓటు వేసిన మంత్రి..కేసు నమోదు

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఎల్లపెల్లిలో గులాబీ కండువాతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు. దీంతో ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిర్మల్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో మంత్రిపై కేసు నమోదైంది. మరోవైపు పటాన్‌చెరు కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ సతీమణి సుధ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించడంపై బీఆర్ఎస్, బీఎస్పీ అభ్యంతరం తెలిపాయి. ముగ్గురు కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఇస్నాపూర్‌ పోలింగ్‌ కేంద్రానికి సుధ వెళ్లారు. దీంతో బీఆర్ఎస్, బీఎస్పీ నేతలు ఆమెతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కలగజేసుకుని వారిని చెదరగొట్టారు. పోలింగ్‌ కేంద్రం చుట్టూ ఉన్నవారిని కూడా అక్కణ్నుంచి పంపించివేశారు.

Spread the love