నవతెలంగాణ- హైదరాబాద్: కొద్ది రోజుల్లో న్యూఇయర్ రాబోతుండటంతో హోటల్స్, మాల్స్, రిసార్ట్స్ పార్టీకి సిద్ధమవుతున్నాయి. అయితే సన్ బర్న్ షో కూడా రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఆ షోకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయినా బుక్ మై షో నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా షో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అసలు ఈ సన్ బర్న్ షో నిర్వాహకులు ఎవరని నిలదీశారు.