బాల కార్మికులతో పని చేయిస్తున్న షాపు యజమానిపై కేసు నమోదు

నవతెలంగాణ – ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఓ కిరాణా షాప్ లో 13 సంవత్సరాల బాల కార్మికులతో పనిచేస్తున్న షాపు యజమాని పై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పిన్నూరి రవీందర్ తన షాపులో 13 ఏళ్ల హరీష్ అనే బాల కార్మికున్ని పనిలో పెట్టుకుని పని చేయిస్తుండడంతో శుక్రవారం నాడు చైల్డ్ లేబర్ ఆఫీసర్ షాప్ పై దాడి చేసి ఆ బాలుని గుర్తించినట్లు తెలిపారు. లేబర్ ఆఫీసర్ షేక్ దావూద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
Spread the love