తెలంగాణ పోలీసులపై ఏపీలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు

నవతెలంగాణ – హైదరాబాద్: నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం ముదురుతోంది. తాజా వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చును రాజేస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ లో సగ భాగాన్ని స్వాధీనం చేసుకుని, కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. భారీ సంఖ్యలో తెలంగాణ పోలీసులు కూడా సాగర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో నిన్న ఏపీ పోలీసులు, అధికారులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు సెక్షన్ 447, 341, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు కేశారు. పల్నాడు విజయపురి పోలీస్ స్టేషన్ లో ఏపీ ఇరిగేషన్ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. సాగర్ డ్యామ్ పై తమ విధులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని తమ ఫిర్యాదులో ఏపీ అధికారులు పేర్కొన్నారు.

Spread the love