– నిందితులను త్వరలోనే పట్టుకుంటాం
– పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి
పాత గొడవలను దృష్టిలో ఉంచుకొని వ్యక్తిపై దాడి చేసిన కేసులో పలువురుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన విరాళలు ప్రకారం తేది 27-8-2024 నాటి ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో, కామారెడ్డి పట్టణంలో గల విద్యానగర్ ఏరియాలో ఉన్న శివాలయం వద్దకు, కామారెడ్డి పట్టణానికి చెందిన పాత విశ్వనాథం, వయస్సు అందాజా 64 సంవత్సరాలు, అనే వ్యక్తి పూజ చేయు నిమిత్తమై వెళ్లగా, అదే సమయంలో పాత గొడవలు మనసులో ఉంచుకున్న కామారెడ్డి కే చెందిన లక్ష్మీబాయి, కొంతమంది కలిసి పాత విశ్వనాథమును అడ్డగించి, డబ్బుల విషయమై గొడవపడి, ఇష్టం వచ్చినట్టుగా పిడి గుద్దులు గుడ్డి, వారికి సంబంధించిన కారులో ఎక్కించుకొని పారిపోయే ప్రయత్నం చేయగా, చుట్టుపక్కల వారు గమనించి, వారిని నిలువరించే ప్రయత్నం చేయగా, అక్కడినుండి లక్ష్మీబాయి, ఆమెతో ఉన్న వ్యక్తులు పారిపోయినారని, ఆ తర్వాత గాయాల పాలైన పాత విశ్వనాథమును కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కొరకై హైదరాబాదులో ఉన్న యశోద హాస్పిటల్ కు తీసుకువెళ్లినట్లుగా, అతని బావమరిది అయిన రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే చికిత్స పొందుతున్న పాత విశ్వనాథం, యశోద హాస్పిటల్ లో చనిపోయినాడు అనే తెలియగా, బుధవారం అతని యొక్క మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి, పంచనామా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ విషయంపై మర్డర్ కేసుగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందనీ, ఈ సంఘటనకు బాధ్యులైన వారిని త్వరలోనే పట్టుకుని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాము అన్నారు.