మోపాల్ మండల్ మాజీ తాసిల్దార్ పై పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు

నవతెలంగాణ-మోపాల్ : మోపాల్ మండలంలోని ఇంతకుముందు ఇక్కడ  తాసిల్దార్ పనిచేసిన లత పైన చీటింగ్ కేసు నమోదు అయినట్లు ఎస్సై రామ్ తెలిపారు .ఎస్సై కథనం ప్రకారం, కంజర గ్రామానికి చెందిన సాంబారి రేవతి అనే మహిళ తన తల్లి  పై ఉన్న భూమిని తనకు చెందాలని ఎంతో ప్రయత్నించినా ఆమెకు పట్టా చేయకుండా కూడా తన తల్లి పేరుమీద ఉన్న భూమిని అదే గ్రామానికి చెందిన చిన్న నరసయ్య అనే వ్యక్తి అన్యాక్రాంతంగా పట్ట చేసుకుని అలాగే ఎవరైతే సాంబార్ రేవతిని బెదిరించినట్లు, అలా బెదిరింపులకు పాల్పడినందుకు ఆయనపై 506 కేసు కూడా నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయంలో ఇక్కడ పనిచేసిన తాసిల్దార్ మరియు కంజర గ్రామం పంచాయతీ కార్యదర్శి ఇద్దరు కూడా నరసయ్యకు సహకరించి పట్ట చేయించారని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమెపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ భూ పంచాయతీ తగాదాలో పెద్ద మొత్తంలో  ఆర్థిక లావాదేవీలు చేతులు మారినట్టు బాధితురాలు తెలిపారు
Spread the love