అభిమాని కోసం సెలబ్రిటీ ఆడే ఆట

అభిమాని కోసం సెలబ్రిటీ ఆడే ఆటమంచు మనోజ్‌ హోస్ట్‌గా ‘ఉస్తాద్‌’ ర్యాంప్‌ ఆడిద్దాం.. పేరిట సరికొత్త టాక్‌ షో ప్రేక్షకులను అలరించనుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్‌ షో ఈనెల 15 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రోమో రిలీజ్‌ ఈవెంట్‌ని మేకర్స్‌ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. మంచు మనోజ్‌ మాట్లాడుతూ, ‘ఇంతకుముందు సినిమాలు చేయాలనే ప్యాషన్‌, గోల్‌తో చేశాను. ఇప్పుడు ప్యాషన్‌ కంటే బాధ్యతతో వచ్చాను. గ్యాప్‌ తీసుకున్నందుకు ఫ్యాన్స్‌ నన్ను క్షమించాలని కోరుతున్నాను. కానీ సారి థౌజండ్‌ కాదు లక్ష కోట్లవాలా పటాకులు పేలబోతున్నాయి. అలాంటి టీం దొరికింది. ఈటీవీ నుంచి రామోజీరావు, బాపినీడు, సాయికష్ణ, నితిన్‌, సాయి కిరణ్‌ అలాగే పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీజీ విశ్వ ప్రసాద్‌ , వివేక్‌ కూచిబొట్ల ఎంతో సపోర్ట్‌ చేశారు. ఈ షో కాన్సెప్ట్‌ నాకు చాలా నచ్చింది. ఇదొక సెలబ్రిటీ గేమ్‌ షో. తమని ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్‌ కోసం సెలబ్రిటీలు ఆడే ఆట ఇది. ఫ్యాన్‌ కోసం సెలబ్రేటీ ఆట ఆడి వాళ్ళకు డబ్బు ఇవ్వడం అనేది చాలా గొప్ప కాన్సెప్ట్‌. ఈ ఆటలో సెలబ్రిటీ గెలుచుకున్న మొత్తాన్ని ఆ అభిమానికి ఇచ్చేస్తాం. అదే ఈ షో స్పెషాలిటీ. ప్రైజ్‌ మనీ వచ్చేసి.. రూ.50 లక్షలు, స్పెషల్‌ గిఫ్ట్‌లు కూడా ఉంటాయి. ఈ షోతో ఫ్యాన్స్‌కి మరింత దగ్గరగా ఉండొచ్చు’ అని తెలిపారు.

Spread the love