సంచార జాతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్రం

– శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాశ్‌
నవతెలంగాణ-ముషీరాబాద్‌
దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీ, ఎంబీసీ, సంచార, విముక్త జాతుల అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేసి దేశం అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతోందని ప్రకటించు కోవడం సిగ్గు చేటని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండ ప్రకాశ్‌ తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతున్నా.. బీసీ ప్రధానిగా చెప్పుకునే నరేంద్ర మోడీ విస్మరిస్తున్నారన్నారు. సంచార, అర్ధసంచార జాతుల కులాల జాతీయ సమ్మేళనం బాగ్‌లింగంపల్లిలోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ముగిసింది. ఈ సందదర్భంగా హైదరాబాద్‌ డిక్లరేషన్‌ 2023ను ఆవిష్క రించారు. అనంతరం బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ సంచా ర జాతుల జీవ ప్రమాణాలను మెరుగుపర్చాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకుంటుందన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ మాట్లాడుతూ జాతీయ బీసీ కమిషన్‌ను నియామకం చేసిన కేంద్రం మిగతా వైన్‌ చైర్మెన్‌, సభ్యులను ఎందుకు నియామకం చేయలేదని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ సంచార జాతులకు చెంది న ప్రజలు ఓటు బ్యాంకుగా మారితేనే రాజకీయ పార్టీలు గుర్తిస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జాతీయ అధ్యక్షులు కొప్పుల రాజు మాట్లాడుతూ గతంలో యూపీఏ ప్రభుత్వం చేసిన కుల గణనను ఈనాటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొక్కి పెట్టినట్టు చెప్పారు. సంచార జాతుల అభి వృద్ధి కోసం ప్రకటించిన హైదరాబాద్‌ డిక్లరేషనుకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందన్నారు. సభలో ప్రొఫెసర్‌ తిరుమలి, డిఎస్టి కమిషన్‌ మాజీ చైర్మన్‌ బాలకృష్ణ రేణకె, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్య క్షులు ఒంటెద్దుల నరేందర్‌, ప్రధాన కార్యదర్శి తిపిరిశెట్టి శ్రీనివాస్‌, ప్రొఫె సర్‌ బసవ చెన్నయ్య, పల్లవి రేణకె, ఏపీ ఎంబీసీ చైర్మన్‌ పెండ్ర వీరన్న, పూసల రవి, సంచార జాతుల యువజన విభాగం అధ్యక్షులు యువరాజ్‌ ప్రధాన కార్యదర్శి వెన్నెల నాగరాజు తదితరులు వివిధ అంశాలపై ప్రసంగించారు.

Spread the love