అశ్వారావుపేట జన సేన అభ్యర్ధిగా మహిళ కు అవకాశం..

– నియోజక వర్గంలో మహిళా ఓటర్లు ఏ అధికం….
– ఆదర్శ వివాహిత గా ఉమాదేవి…
అశ్వారావుపేట – నవతెలంగాణ: అశ్వారావుపేట నియోజక వర్గం జనసేన పార్టీ అభ్యర్ధిగా మహిళ కు అవకాశం కల్పిస్తూ ఆ పార్టీ అద్యక్షుడు తీసుకున్న హేతుబద్దంగా ఉంది.ఎందుకంటే ఈ నియోజక వర్గంలో పురుషులు కన్నా 3 వేలు పై చిలుకు మహిళా ఓటర్లు ఉన్న నేపధ్యం గమనార్హం. ప్రస్తుతం అభ్యర్ధిగా ఎన్నికల సమరంలో దిగుతున్న ముయ్యబోయిన ఉమాదేవి సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఆదర్శ వివాహిత కావడం మరో అనుకూల అంశం. మరో విశేషం ఏమిటి అంటే ఈ నియోజక వర్గం ప్రధమ ఎమ్మెల్యే దివంగత వగ్గెల మిత్ర సేన కు ఉమాదేవి సమీప బంధువు కావడం.
గిరిజన (కోయ) కులానికి చెందిన ఉమాదేవి భర్త కాపు సామాజిక వర్గం. ఈ రెండు సామాజిక వర్గాల్లో మంచి పట్టు,గుర్తింపు ఉండటం. భర్త జర్నలిస్టుగా అన్నీ వర్గాల్లోనూ సత్సంబంధాలు, పరిచయాలు కలిగి ఉన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపు గెలుపొందిన దివంగత మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్ర సేన దగ్గర బంధువు కావటం. భర్త నాగబాబు ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ అధ్యక్షులుగా ఏర్పాటు చేసిన యువ రాజ్యానికి డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసారు. చిరంజీవి సేవా సమితి ద్వారా స్థానికంగా సుమారు 1500 మంది కి రక్తదానం చేయించడం. పలు సేవా కార్యక్రమాలలో పాల్గొని ఉండటం ఉండటం వల్ల భర్త నాగబాబుకు మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా కార్యదర్శిగా భర్త నాగబాబు పనిచేస్తున్నారు. పవన్ కళ్యాన్ సోదరుడు చిరంజీవి పట్ల అమితమైన అభిమానం కలిగి ఉంటారు. చిరంజీవి పుట్టిన రోజే వీరి ఏకైక కుమారు సైతం జన్మించడం తో అతనికి  చిరంజీవి గా నామకరణం చేసారు. కరోనా కాలంలో పవన్ కళ్యాణ్ సేవా సమితి ద్వారా మృతి చెందిన వారిని ఖననం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని సహాయ సహకారాలు అందించడంలో వీరి ఇరువురి పాత్రం కీలకంగా ఉండటం గర్వించదగ్గ విషయం.
పేరు: ముయ్యబోయిన ఉమాదేవి
భర్త పేరు: కురి శెట్టి నాగబాబు
పుట్టిన తేదీ: 23/06/1990
కులం: గిరిజన(కోయ)
వృత్తి : గృహిణి
Spread the love