స్నేహితుడి వైద్యం కోసం బాల్య మిత్రుల తపన 

– సురేష్ వైద్యం కోసం రూ.77,700/- అందజేత
– హైద్రాబాద్ లో ఆరోగ్య స్థితి గతులు తెలుసుకుంటున్న స్నేహితులు
నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామనికి చెందిన కాస్తి సురేష్(30) గత 6 నెలలుగా తన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి క్షీణించడతో హైదరాబాదులోని డెక్కన్ ఆస్పత్రిలోకి చికిత్స కోసం చేర్చారు. వీరిది కడుపేదరికం కావడంతో వైద్యం కోసం డబ్బులు లేని పరిస్థితి లేవు మరో కిడ్నీ దొరకక పోవడంతో సురేష్ తల్లి చంద్రవ్వ  కిడ్నీ ఇస్తుంది. ఆర్థిక స్తొమత లేక ఇబ్బందులు పడుతున్నా విషయం బాల్య మిత్రుల దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించి స్నేహితుడి కిడ్నీ మార్పిడి బాల్య స్నేహితులు డబ్బులు పోగేసి రూ.77,700 లు వైద్యం కోసం వారికి తోచిన సహాయాన్ని హైదరాబాద్ డెక్కన్ ఆస్పత్రిలో సురేష్ సోదరుడికి  అందజేశారు.ఈ సందర్భంగా సురేష్ ఆరోగ్యం కోసం సహయం అందించిన  ప్రతి ఒక్కరికి పేరు పేరున అతడి స్నేహితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన సురేష్  ఆరోగ్యానికి దాతలు, మనసున్న మారాజులు సహకారం అందించాలని, సహాయం చేయాల్సిన వారు +919666646521 ఈ నెంబర్ సంప్రదించాలని కోరుతున్నారు. ఆస్పత్రిలో సురేష్ వైద్య ఖర్చుల డబ్బులు అందించిన వారిలో శ్రీకాంత్, రమేష్, రమేష్, మనోజ్, రాజు, యాదగిరి, స్వామి, అశోక్, కుమార్, నరేష్, రాకేష్, రాజు, సంతోష్, చందు తదితరులు ఉన్నారు.
Spread the love