అవకతవకలపై విచారణ కమిటీ వేయాలి

– జేఎన్టీయూ హెచ్‌జేఏసీ, విద్యార్థుల వినతి
నవతెలంగాణ-కేపీహెబీ
జేఎన్టీయూహెచ్‌ యూని వర్సిటీ ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ లో జరిగిన అవకతవకలపై విచారణ కమిటీ వేయాలని జే ఎన్టీయూ హెచ్‌జేఏసీ, విద్యా ర్థులు అన్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌లో పలు అవకతకలు జరుగుతున్నాయన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను బలి చేసి దాని వెనుకున్న అధికారులు కుట్ర దారులు తప్పించుకుంటున్నారన్నారు. దీని వెనుక యూనివర్సిటీ అధికారులు హస్తం ఉందన్నారు. దానిపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీి వీసీ, రిజి స్ట్రార్‌, రెక్టార్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వీసీకి వినతి పత్రం అందజేశారు.

Spread the love