నవతెలంగాణ -భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం కత్తిపోటుల కలకలం రేగింది. అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మనోజ్ అనే ఉద్యోగిపై మరో ఉద్యోగిని కత్తితో దాడి చేసింది. తోటి ఉద్యోగులు గాయపడ్డ వ్యక్తిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆత్మ రక్షణ కోసం దాడి చేయాల్సి వచ్చిందని మహిళా ఉద్యోగిని పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడికి గల కారణాలు విచారణ చేస్తున్నారు. రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళ ఓకే ఆఫీసులో పని చేస్తుండటంతో.. రెండేళ్లుగా మనోజ్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలోస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.