నవతెలంగాణ -హైదరాబాద్: ప్రభుత్వం నిన్నటి నుంచి కులగణన సర్వే ప్రక్రియ ప్రారంభించింది. ప్రతి ఇంటికీ వెళ్తున్న సిబ్బంది ఇంటి నంబర్, యజమాని పేరు నమోదు చేసుకుంటున్నారు. రేపటి వరకు ఆ వివరాలన్నీ సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే మొదలవుతుంది. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను ఎంటర్ చేస్తారు. ఈ ప్రక్రియను నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.