– ఆళ్ళపల్లి ఎస్సై రతీష్
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులను ఈ నెల 9వ తారీకు వరకు కొత్తగూడెం కోర్ట్ లో జరిగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చని స్థానిక ఎస్సై ఈ.రతీష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాక్సిడెంట్ కేసులు, వివాహ సంబంధించిన కేసులు, చీటింగ్ కేసులు రాజీ చేసుకోవచ్చని చెప్పారు. అదేవిధంగా ఇందులో పెట్టిన కేసులు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు అతి తక్కువ ఫైన్ వేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రూ.500 నుండి రూ.1000 వరకు మాత్రమే ఫైన్ ఉన్నందున ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే కేసులలో ఉన్నారో కోర్టుకు వచ్చి అపరాధ రుసుం కట్టుకొని, కేసు క్లోజ్ చేసుకోవచ్చని చెప్పారు. అందులో భాగంగా ఈనెల తొమ్మిదవ తేదీ వరకు కోర్టులో హాజరై, సంబంధిత కోర్టు కానిస్టేబుల్ ను సంప్రదించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.