ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దుస్తువులు పంపిణీ చేసిన కార్పొరేటర్

నవతెలంగాణ – మీర్ పేట్
తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ దీనదయాల్ నగర్ లోని మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందజేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఉపాధ్యాయులు పిల్లలకు ఆటల పోటీలలు నిర్వహించారు. ఆటల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ సొంత ఖర్చుతో బహుమతులు అందజేశారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణను కూడా నేర్పించాలని ఉపాద్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love