కోటిన్నరతో పరారైన దంపతులు..

నవతెలంగాణ – ఆర్మూర్  
 పట్టణంలోని పెర్కిట్ లో నివసిస్తున్న   నీలకంఠం ప్రవీణ్ , సతీమణి నీలకంఠం సాయి లావణ్య లు కోటిన్నర డబ్బులకు ఎగనామం పెడుతూ రాత్రికి రాత్రే పరారైన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.. నీలకంఠం ప్రవీణ్ దంపతులు డబ్బులు ఇచ్చిన వ్యక్తులకు ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే పెర్కిట్ నుంచి ఉడాయించారు. దీంతో పెర్కిట్ ఏరియాలో జాతీయ రహదారి ప్రక్కన కిరాణా, జనరల్ దుకాణాలతో పాటు చీరల దుకాణాన్ని సైతం ఆ దంపతులు నిర్వహించేవారు. ఆ దంపతులు రాత్రికి రాత్రే ఊడాయించగా, పెరికిట్లోని కాంతి హై స్కూల్ లో వారి పిల్లల టీసీలను కూడా తీసుకెళ్లి గ్రామానికి తిరిగి రాకుండా పక్కాడ్బందీగా అన్ని సిద్ధం చేసుకుని పరారయ్యారు. ఆ దుకాణ ఏరియాల్లోకి ఆ దంపతులకు డబ్బులు ఇచ్చి మోసపోయిన సుమారు 60 మంది వ్యక్తులు రెండు రోజులుగా వస్తూ వెళ్తూ వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్ పల్లి తదితర మండలాల్లోని గ్రామాల్లోని ప్రజల నుండి నమ్మకం కలిగించి దండిగా డబ్బులను తీసుకుని దంపతుల్దిరూ పరారయ్యారు. దీంతో వారికి డబ్బులు ఇచ్చి మోసపోయిన వ్యక్తులు వారి దుకాణాల వద్దకు వచ్చి రెండు రోజులుగా లబోదిబోమని మొత్తుకుంటున్నట్లు తెలిసింది. సదరు దంపతులు వారి ఇరువురి సెల్ ఫోన్లను కాల్ డైవర్ట్ పెట్టి, స్విచ్ ఆఫ్ చేసి, ఎటు వెళ్లారో తెలియకుండా చేస్తున్నారని, వారికి డబ్బులు ఇచ్చి మోసపోయిన వ్యక్తులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఏది ఏమైనా అమాయక ప్రజలను నమ్మించి మోసగించి కోటిన్నర డబ్బులతో ఉదయించిన నీలకంఠం ప్రవీణ్ నీలకంఠం సాయి లావణ్య దంపతులను సంబంధిత అధికారులు పట్టుకొని మోసపోయిన మాకు న్యాయం చేయాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.
Spread the love