లౌకిక, ప్రజాస్వామిక శక్తులకు తీరని లోటు

– జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మరణం పట్ల ఆవాజ్‌ సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యాసత్‌ ఉర్దూ దిన పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీ ఖాన్‌ మృతి పట్ల ఆవాజ్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అబ్బాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలీఖాన్‌ అభ్యుదయ వాదిగా , లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం తన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాద, నియంతృత్వ ప్రమాదాన్ని నిలువరించడానికి అనేక ప్రజా సంఘాలు లౌకిక, వామపక్ష, ప్రజాస్వామిక, సామాజిక శక్తులతో కలిసి పనిచేశారని గుర్తుచేశారు. వివిధ విపత్తుల సందర్భంతో బాధితులకు, పేద ప్రజలకు సహకారం అందించేందుకు కృషి చేశారని తెలిపారు. ఆయన మృతి లౌకిక, ప్రజాస్వామిక, సామాజిక శక్తులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మరణం పట్ల సీపీఐ సంతాపం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సియాసత్‌ దినపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ఆకస్మిక మరణం పట్ల సీపీఐ రాష్ట్ర సమితి తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వామపక్ష పార్టీలంటే ఎంతో అభిమానం కలిగిన వ్యక్తి అలీఖాన్‌ అని గుర్తు చేశారు. చార్టెడ్‌ అకౌంటెంట్‌ కోర్స్‌ పూర్తి చేసిన తర్వాత 35 ఏండ్లు జర్నలిజంలో ఉండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆయన మరణం దురదృష్టకరమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ఉర్దూ పత్రికా రంగానికి ఆయనవి ఎనలేని సేవలు ొ జహీరుద్దీన్‌ అలీఖాన్‌కు మంత్రి హరీశ్‌ సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సియాసత్‌ మేనిజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ఉర్దూ పత్రికా రంగానికి ఎనలేని సేవలందించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హోంమంత్రి మహముద్‌ అలీతో కలిసి మంగళవారం అలీఖాన్‌ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలీఖాన్‌ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Spread the love