తరుగు పేరుతో ధాన్యంలో కోత..

– లబోదిబోమంటున్న బాధిత రైతు మల్లయ్య
– న్యాయం చేయాలని వేడుకోలు
నవతెలంగాణ-మల్హర్ రావు : రైతులు ఆరుగాలం కష్టపడి, ఎంతో శ్రమకోర్చి పండించిన వరి దాన్యాన్నీ ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుందామంటే కొనుగోలు నిర్వాహకులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై తరుగు పేరిట భారీగా కోత విధిస్తూ నిలువు దోపిడీకి గురిచేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.ఇందుకు సాక్షాత్తు నిదర్సనమే మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి మల్లయ్య అనే రైతు ఈ రబి సీజన్ పండించిన 543 దాన్యం బస్తాల ధాన్యాన్ని డిసిఎంఎస్  ఆధ్వర్యంలో కొయ్యుర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి దాన్యం కొనుగోలు కేంద్రంలో మూడు దపాలుగా విక్రయించినట్లుగా తెలిపాడు.అయితే కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు రమేష్ రెడ్డి 40 కిలోల బస్తాకు 3 నుంచి 5 కిలోల చొప్పున తరుగు పేరిట రైస్ మిల్లర్లతో కుమ్మకై కోత విధించి భారీగా దోపిడీకి పాల్పడిననట్లుగా బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.కల్లంలో దాన్యం తూకం వేసినప్పుడు రాసిన ట్రక్ సిట్ కు కటింగ్ తరువాత చూపిన ట్రక్ సిట్ కు పొంతన లేదని,రైస్ మిల్లు వద్ద కోత విధించినట్లుగా ఆన్ లైన్ లో పొందుపరిచిన పూర్తి డాటా నిర్వహకుడిని నిలదీస్తే పొంతన లేని సమాధానం చెప్పడమే కాక నీకు దిక్కున్న చోట చెప్పుకొని అంటుంన్నట్లుగా బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.తనను తరుగు పేరిట 20 క్వింటాళ్ళ దాన్యం దోపిడీకి గురికావడంతో  రూ.40వేల వరకు నష్టం జరిగిందని వాపోయాడు.ఇప్పటికైనా సంబంధించిన  జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తన్స్కు న్యాయం చేయాలని, అలాగే నిర్వహకుడి దోపిడిపై పూర్తి విచారణ చెపడితే భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని బాధిత రైతు వాపోతున్నాడు.
Spread the love